'అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు'
WNP: రేవల్లి మండలం లోని కొంకలపల్లి శివారు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును బుధవారం రాత్రి రేవల్లి పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ సురేశ్‌ను ప్రశ్నించగా ట్రాక్టరు నాగర్ కర్నూల్ కు చెందిన సతీష్ గౌడ్‌కు చెందినదని తెలిపారు. యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నట్లు ఎస్సై రజిత చెప్పారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు అన్నారు.