ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు

కోనసీమ: అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం గ్రామంలో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. దీంతో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఈదురుగాలులు వీచేటప్పుడు మంటలు చెలరేగుతున్నాయని తెలిపారు. అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.