రైలు ఢీకొని వ్యక్తి మృతి
నెల్లూరు: పడుగుపాడు రైల్వే స్టేషన్ ఇనమడుగు గేటు వద్ద రైలు ఢీకొని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి చేతికి సెలైన్ కెనాల్స్ ఉంది. దీంతో అతను చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.