VIDEO: వర్షాలు, గాలి దుమారాలు, పంటలపై కీలక సూచనలు
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారంలోని పంచాంగం సీతారామస్వామి ఆలయంలో పండితులు విఠల్ శర్మ గ్రామస్తులకు పంచాంగం చెప్పారు. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, గతంలోలాగే వర్షాలు వస్తున్నాయని, అయితే ఈసారి వర్షాలు, ఎండలు తీవ్రంగా ఉంటాయని, గాలి దుమారాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరి జాతకం బాగుంటుందని అన్నారు.