VIDEO: 'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'
MHBD: సీరోల్ మండలం కాంపల్లి గ్రామంలో శనివారం రాత్రి SI సంతోష్ ఆధ్వర్యంలో "కళాజాత" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ఇలాంటివి ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.