చిన్నారులను ఆశీర్వదించిన సీఎం

చిన్నారులను ఆశీర్వదించిన సీఎం

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి శ్రీలక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో అడుసుమిల్లి వారి నూతన వస్త్రబహుకరణ వేడుక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు.