VIDEO: తుఫాన్ ప్రభావం.. బాధితుల ఆవేదన
KKD: మొంథా తుఫాన్ తమను నిలువునా ముంచేసిందని దుమ్ములపేట ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రజలు వాపోయారు. శని ఆదివారాలు కురిసిన భారీ వర్షంతో తమ ప్రాంతాలలో వర్షపు నీరు నిండిపోయి ఇళ్లల్లోకి చేరుకుందని వారు పేర్కొన్నారు. ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు దుమ్ములపేట వచ్చినప్పటికీ తమ ప్రాంతాన్ని సందర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.