VIDEO: ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

VIDEO: ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

NGKL: ఈనెల 2న ప్రారంభమైన బిజినేపల్లి మండలం వట్టెం శ్రీ వెంకటేశ్వరస్వామి 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ప్రసాదాచార్యుల నేతృత్వంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించింది. చివరి రోజు స్వామివారికి అభిషేకం, చక్రతీర్థ కార్యక్రమాలు నిర్వహించి, పవిత్ర పుష్కరిణిలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.