VIDEO: హైడ్రా చొరవతో స్మశాన వాటికకు స్థలం కేటాయింపు
HYD: కుత్బాల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్‌లో స్మశానవాటిక లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి తమ సమస్యను విన్నవించుకోగా, స్థానిక అంబీర్ చెరువు పక్కన స్మశాన వాటిక ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. ఈ క్రమంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రా కమిషనర్ రంగానాథ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.