కొత్తగూడ మండల కేంద్రంలో నిరసన
MHBD: జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో MRPS, MSP మానుకోట జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ BR గవాయిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, తగిన శిక్ష విధించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. దాడి విషయమై కొత్తగూడ తహసీల్దార్ రాజుకు వినతిపత్రం సమర్పించారు.