రైతులకు సమీకృత పశువుల దాణా పంపిణీ
VZM: వేపాడ మండలంలో గల పాడి రైతులకు రాయితీపై సమీకృత పశువుల దాణా పంపిణీ చేస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్ G.గాయత్రి శనివారం తెలిపారు. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఇప్పటికే 18 టన్నుల పశువుల దాణా పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. RSK లో ముందుగా నమోదు చేసుకున్న రైతులకు 50% రాయితీతో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.