పినపాకలో రోడ్డు భద్రతపై ఎమ్మెల్యే పిలుపు
BDK: పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్‌లో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రతా నియమాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు.