రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం: ఎమ్మెల్యే
సత్యసాయి: బుక్కపట్నం మండలం మారాల, సీకాయకుంటపల్లి, కృష్ణాపురం గ్రామాల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఇంటింటా పర్యటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. చంద్రబాబును రైతు బాంధవుడిగా ఆమె అభివర్ణించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.