మొగుడాలపాడు బీచ్‌లో పర్యాటకుల సందడి

మొగుడాలపాడు బీచ్‌లో పర్యాటకుల సందడి

SKLM: గార మండలంలోని మొగుడాలపాడు బీచ్ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబాలు, యువత బీచ్‌కు తరలివచ్చారు. సముద్ర అలల అందాలను ఆస్వాదిస్తూ సందర్శకులు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. చిన్నారులు ఇసుకతో ఆటలాడగా, కొందరు అలల వద్ద సేదతీరారు.