ఈ అవార్డ్ అభిమానులకు అంకితం: అల్లు అర్జున్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2025లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అలాగే వేర్వేరు విభాగాల్లో అవార్డులు అందుకున్నవారికి కూడా బన్నీ అభినందనలు తెలిపాడు.