కామారెడ్డి డిపిఆర్ఓగా ఎన్. భీమ్ కుమార్

KMR: డిపిఆర్ఓగా ఎన్. భీమ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంత వరకు సిద్దిపేట డిపిఆర్ఓ రవికుమార్ ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించేవారు. డిపిఆర్ఓ భీమ్ కుమార్ హైదరాబాద్ ఐఎంపిఆర్ స్పెషల్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసి బదిలీపై కామారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.