ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు

ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు

MLG: ఈ నెల 14న బాలల దినోత్సవం సందర్భంగా తాడ్వాయి మండలం ఊరట్టం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో,వాలీబాల్, రన్నింగ్ పోటీలు జరగగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు.