'సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి'
SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సోలిపురం అశ్విని కన్నా రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.