'ఈ నెల 28న ఛలో పార్లమెంట్‌ను జయప్రదం చేయండి'

NZB: నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద AIPSU ఆధ్వర్యంలో నేడు చలో పార్లమెంట్ పోస్టర్లు ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలని, చరిత్రను వక్రీకరిస్తూ చేస్తున్న ఎన్సీఈఆర్ సిలబస్ మార్పులను ఆపాలని కోరారు. ఈనెల 28న తలపెట్టిన ఛలో పార్లమెంట్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.