VIDEO: అకస్మాత్తుగా మంటలు.. కారు దగ్ధం.!
BHNG: బీబీనగర్ మండలంలోని జైన్ కంపెనీ సమీపం వద్ద ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వరంగల్-HYD వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు యజమానికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్పందన లేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.