మహిళల భద్రతే మా ప్రాధాన్యం: ఎస్పీ

మహిళల భద్రతే మా ప్రాధాన్యం: ఎస్పీ

MBNR: జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ డి. జానకి తెలిపారు. మార్చి నెలలో షీ టీమ్స్ 15 ఫిర్యాదులను స్వీకరించి, వేధింపులకు పాల్పడుతున్న 10 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 హాట్‌స్పాట్ తనిఖీలు, 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఆపదలో ఉన్నవారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆమె సూచించారు.