పెరిగిన నిమ్మ ధరలు.. రైతులకు ఊరట
KDP: నిమ్మ ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఊరట చెందుతున్నారు. గతంలో కిలో నిమ్మకాయలు రూ.110 నుంచి రూ.80లకు పడిపోయాయి. వేసవి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో నిమ్మకాయలకు వివిధ రాష్ట్రాల మార్కెట్ల పరిధిలో గిరాకీ పెరగడంతో జనవరిలో లూజు నిమ్మకాయల బస్తా రూ.500లు పలికింది. ప్రస్తుతం టన్ను నిమ్మకాయలు రూ.9200 పలుకుతున్నాయి. నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.