అంటిపేటలో ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమం
PPM: అంటిపేటలో ఇవాళ నిర్వహించిన డ్రైడే కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. ఇళ్ల పరిసరాలు, కాలువల్లో నీరు నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శశిభూషణరావు సూచించారు. పరిశుభ్రతపై గ్రామస్థులందరూ బాధ్యత తీసుకుంటే వ్యాధులను నివారించవచ్చని ఆయన తెలిపారు.