VIDEO: మీడియాపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం: ఎమ్మెల్యే
SS: ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని బుధవారం పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపితే దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను అణచివేయడమేనని, వైసీపీ తన తీరును మార్చుకోవాలని ఆమె హితవు పలికారు.