ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన
NRML: గల్ఫ్ దేశాలకు వెళ్లే ఆశావాహులకు శనివారం ఖానాపూర్ పట్టణంలో ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యులు నరేష్ రెడ్డి, స్వదేశీ పరికపండ్ల తదితరులు ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను వివరించారు. మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.