'రాష్ట్ర హోదా ఏమైంది?'.. కేంద్రాన్ని నిలదీసిన సీఎం

'రాష్ట్ర హోదా ఏమైంది?'.. కేంద్రాన్ని నిలదీసిన సీఎం

జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా విషయంలో కేంద్రంపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. పార్లమెంట్‌లో ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. డీలిమిటేషన్, ఎన్నికలు అనే రెండు దశలు పూర్తయ్యాయి కదా.. మరి మూడో దశ అయిన 'రాష్ట్ర హోదా' ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు. సుప్రీంకోర్టుకు చెప్పినట్లుగా వెంటనే రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.