VIDEO: ఆత్మహత్యాయత్నం.. కాపాడిన లేక్ పోలీసులు

VIDEO: ఆత్మహత్యాయత్నం.. కాపాడిన లేక్ పోలీసులు

KNR: జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కాపాడినట్లు లేక్ పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన వేల్పుల సంపత్ కుటుంబ కలహాల నేపథ్యంలో డ్యాంలో అర్ధరాత్రి నీళ్లలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన హోంగార్డు శ్రీనివాస్ అతడిని కాపాడినట్లు తెలిపారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.