సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
SRD: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎలిచల సుగుణ మల్లారెడ్డి అన్నారు. సోమవారం తడ్కల్, భగవాన్ కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ ప్రజలతో కలిసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో జరిగేలా చూడాలని గుత్తిదారులకు సూచించారు.