తల్లి మందలించడంతో కొడుకు అదృశ్యం

తల్లి మందలించడంతో కొడుకు అదృశ్యం

GNTR: పాత గుంటూరుకు చెందిన 7వ తరగతి విద్యార్థి యశ్వంత్ అదృశ్యమైనట్లు తన తల్లి జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 15వ తేదీన హోమ్‌వర్క్ చేయలేదని తల్లి మందలించింది. తర్వాత రోజు ఉదయాన్నే స్కేటింగ్‌కి వెళ్లివస్తానని చెప్పి యశ్వంత్ తిరిగి రాలేదు. దీంతో తల్లి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.