బ్రహ్మ సాగర్ రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే
KDP: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని బ్రహ్మ సాగర్ రిజర్వాయర్ నందు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ.. రెండు సార్లు పది లక్షలు చేప పిల్లలను వదిలామని, ఈసారి 12 లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందని అన్నారు. ఇంకొక 15 రోజులలో 18 లక్షల చేప పిల్లలను వదలడానికి టెండర్లు కూడా పిలిచామని, తొందర్లో వదలడం జరుగుతుందన్నారు.