VIDEO: పెనమలూరులో వృద్ధురాలి వేదన

కృష్ణా: పెనమలూరుకి చెందిన చెరుకు వసంత అనే వృద్ధురాలు కన్నీటి గాధతో మీడియా ముందుకొచ్చింది. 1975 నుంచి పేరంటాలమ్మ చెరువు కట్ట వద్ద నివసిస్తున్నానని, కరెంటు బిల్లు, పన్ను రసీదులు ఉన్నా కొంతకాలం ఊరు వదిలి తిరిగి వచ్చేసరికి తన స్థలాన్ని ఇతరులు ఆక్రమించారని వాపోయింది. నిలవ నీడ లేకుండా బయటికి తోసేశారని, కలెక్టర్ దాకా వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.