VIDEO: వీధి కుక్కల స్వైర విహారం.. భయాందోళనలో స్థానికులు
GNTR: పొన్నూరు పట్టణంలోని రైలుపేట 9,10 వార్డుల్లో వీధి కుక్కలు రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలు, రోడ్లపై వెళ్లే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కుక్కల సంఖ్య పెరగడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.