సీఎం ఆదేశం.. వైద్యుడిపై సస్పెన్షన్ వేటు

సీఎం ఆదేశం.. వైద్యుడిపై సస్పెన్షన్ వేటు

AP: విధుల్లో నిర్లక్ష్యం వహించిన నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ నారాయణ స్వామిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 26న ఓ మహిళకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసి.. ఆమె శరీరంలో సర్జికల్ బ్లేడ్‌ను వదిలేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం.. వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.