'ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి'
JGL: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో రబీ సీజన్ కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.