ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: గోపాలపురం నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణుల కోసం దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్ హాల్లో నిన్న జరిగిన ఆత్మీయ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం పాటిస్తున్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆత్మీయత, సహనం, శాంతి, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు.