యువతి అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు
JGL: మల్యాల మండలం నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన చెట్పల్లి మనీషా (20) అదృశ్యమైనట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న మనీషా బుధవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదని ఆమె తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు.