సునేత్ర పవార్‌కు కాంగ్రెస్‌ ఝలక్‌

సునేత్ర పవార్‌కు కాంగ్రెస్‌ ఝలక్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్రకు ఎదురుదెబ్బ తగిలింది. సునేత్ర విజ్ఞప్తిని కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. దీంతో ఉన ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకున్న ఆమె ప్రయత్నం విఫలమైంది. కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.