వాట్సాప్ గవర్నెన్స్ 'డోర్ టు డోర్ సర్వే'
కృష్ణా: గుడ్లవల్లేరులో శుక్రవారం వాట్సాప్ గవర్నెన్స్ 'డోర్ టూ డోర్' సర్వేని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విజన్‌లో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం మరింత దగ్గరగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా, అవసరమైన సేవలపై అభిప్రాయాలు సేకరించారు.