సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు: కేటీఆర్
JGL: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, హరీష్ రావులు చేరుకున్నారు. ఈనెల 20న నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ రాకతో జగిత్యాలలో పండగ వాతావరణం కనిపిస్తోంది. సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం రోడ్లను తవ్వుతుందని విమర్శించారు. ఇదే సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరతారని స్పష్టం చేశారు.