విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: అర్హులైన ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేశ్ రెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.cgg.gov.in లో సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.