ఓటు వేయాలంటే 10 కి. మీ నడవాల్సిందే..!
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచు తెగ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరహాబాద్, మల్లాపూర్ ప్రాంతాల చెంచులు మన్ననూరుకు, కొమ్మన పెంట, కొల్లం పెంట ప్రాంతాల ఓటర్లు దట్టమైన అడవిలో 10 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది.