మహేష్ బాబుతో సందీప్ వంగా మూవీ?

మహేష్ బాబుతో సందీప్ వంగా మూవీ?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. అయితే సందీప్ ప్రభాస్ 'స్పిరిట్'తో, మహేష్ 'SSMB 29'తో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్, సందీప్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.