అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
MNCL: చెన్నూర్ మండలం కిష్టంపేటలో గల డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం చెన్నూర్ పట్టణంలో చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులను,100 పడకల ఆసుపత్రి ప్రహరీ గోడ నిర్మాణాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలన్నారు.