VIDEO: 'రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి'

VZM: దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని కొరియర్ వెహికల్ డీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాండెందొర వలస గ్రామానికి చెందిన తటకోని లక్ష్మణరావు, ఆవాల రాముగా పోలీసులు గుర్తించారు.