ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: పామర్రు లోని 4వ సచివాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శనివారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.