పింఛన్ల సొమ్ముతో లైన్‌మెన్ పరార్

అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన వెంకటేష్ తెట్టు సచివాలయంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తెట్టు దళితవాడలో పింఛన్ల పంపిణీ చేసేందుకు ఆయనకు రూ. 4.90 లక్షలు అందజేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి వెంకటేష్ కనబడటం లేదు. దాదాపు 80 మందికి నగదు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు ఎంపీడీవో గంగయ్య వెల్లడించారు.