మురికి కాలువలో పూడికతీత పనులు
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సైతారుపేట జంక్షన్ వద్ద మురికి కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. జేసీబీతో చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాలువలో చెత్త వేయడంతో మురుగునీరు సరిగా సరఫరా కావడం లేదు. కాలువ సమీపంలో గల పెంజెరువులో కూడా పూడిక తీయనున్నట్లు సానిటరీ ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు.