కదిరి బస్టాండ్‌లో బంగారం చోరీ కలకలం

కదిరి బస్టాండ్‌లో బంగారం చోరీ కలకలం

సత్యసాయి: ముదిగుబ్బ మండలం చెలిమి బావి వీధికి చెందిన హేమలత మంగళవారం కదిరి RTC బస్టాండ్‌లో తన కుమార్తెతో కలిసి బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా దొంగతనం జరిగింది. ఆమె బ్యాగ్‌లో ఉంచిన ఐదు తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కదిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.