VIDEO: జనకాపూర్‌లో రాత్రి వేళల్లో రోడ్డుపైనే పశువుల తిష్ట
ASF: ఆసిఫాబాద్ మండలంలోని జనకాపూర్‌లో రాత్రి వేళల్లో రోడ్డుపై పశువులు తిష్ట వేయడం వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రి వేళ పశువులు గుంపులుగా రోడ్డుపై ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా చీకటి సమయంలో పశువులు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలన్నారు.