'నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలి'
SKLM: రణస్థలం మండలంలో కొండములగాం ఏపీ మోడల్ స్కూల్‌ను సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి హరిబాబు సందర్శించారు. స్కూల్లోని మౌలిక సదుపాయాలు గురించి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని వంట సిబ్బందిని ఆదేశించారు.